26-01-2026 06:11:08 PM
పద్మశాలీలకు అండగా ఉన్న ఎమ్మెల్యే విజ్జన్న
పెద్దపల్లి పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు యాదగిరి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పద్మశాలీలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అండగా ఉన్నారని పెద్దపల్లి పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు యాదగిరి అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ లో గల శ్రీనివాస చేనేత సహకార సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షలు నిధులు మంజూరు చేసిన సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న చిత్రపటానికి గాంధీనగర్ పద్మశాలీలు కుల బాంధవులు సోమవారం పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ... గత 10 ఏళ్లుగా పాలకులు పద్మశాలి కులస్తుల ఓట్లు వేయించుకోవడమే తప్ప కులస్తులకు సంక్షేమానికి చేసిందేమీ లేదని అన్నారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న ను అడగగానే సంఘం కాంపౌండ్ వాల్ కు నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చేనేత సంఘం పాత బకాయిలు పూర్తిగా మాఫీ చేయించి, సంఘాన్ని తెరిపించి గాంధీ నగర్ లోని పద్మశాలు, కార్మికులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు.
పద్మశాలి కులస్తులు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజ్జన్నకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు దాసరి శంకరయ్య, చిలగాని లక్ష్మణ్, సామల రాజేంద్రప్రసాద్, గాదాసు రవి, ఆడెపు శ్రీనివాస్, దూడం శంకరయ్య, గోలి శ్రీనివాస్, కామని మొండయ్య, బొద్దుల చక్రపాణి, తుమ్మ రాజేశం, ఎనగంటి రమేష్, బొల్లి చంద్రమౌళి, కామని అజయ్, కామని విజయ్, శ్రీకాంత్ , కోమాకుల రమేష్, కురుమ ధీరజ్, దాసరి శాంతమ్మ, బండి శారద, భారతి, పద్మ, గాంధీనగర్ పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.