28-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రగతే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025పై సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ పాలసీ భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా ఉండాలన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ , 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యా ప్ పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించాలన్నారు. సమీక్షలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అజారుద్దీన్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.