calender_icon.png 10 November, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా మేళాను సింగరేణి కార్మిక పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి

10-11-2025 08:46:59 PM

టీబీజీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి          

మణుగూరు (విజయక్రాంతి): ఏరియా లోని పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియం నందు  ఈనెల 19న జరగనున్న మెగా జాబ్ మేళాను సింగరేణి కార్మిక పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని, టీబీజీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం ఆయన  ప్రకాశం ఓపెన్ కాస్ట్ 2 విభాగా నికి చెందిన యస్ అండ్ డి సెక్షన్ ను సందర్శించి, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ చైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం దిశ నిర్దేశం, ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ప్రత్యేక చొరవతో  సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహి స్తుందని సింగరేణి  కార్మిక కుటుంబాల పిల్లలు ఎవరైనా  నిరుద్యోగులు ఉంటే యాజమాన్యం కల్పించే ఈ సువర్ణమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.