calender_icon.png 10 November, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం పట్ల సంతాపం తెలిపిన కాంగ్రెస్ నేత బుడ్డ భాగ్యరాజ్

10-11-2025 08:45:20 PM

తూప్రాన్ (విజయక్రాంతి): అందెశ్రీ అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తాజా మాజీ సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్ దిగ్బ్రాంతితో విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటనీ అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. తాజా మాజీ సర్పంచ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.