calender_icon.png 10 November, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

10-11-2025 08:48:39 PM

సిఐ కే శశిధర్ రెడ్డి..

మందమర్రి (విజయక్రాంతి): ఈ నెల 15న జరుగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పట్టణ సీఐ కె శశిధర్ రెడ్డి కోరారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకోవడం కంటే సామరస్యం నిండిన రాజీమార్గమే అత్యుత్తమని తెలిపారు. లోక్ అదాలత్ తో సత్వర న్యాయం జరుగు తుందన్నారు. రాజీపడ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.

రాజీ మార్గం రాజా మార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్ తో బాధితులకు సత్వరమే న్యాయం జరుగు తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సర్కిల్ పరిధిలోని మందమర్రి, రామకృష్ణాపూర్, కాసీపేట, దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కక్షిదారులు   లోక్ అదాలత్ లో పాల్గొని తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకొని, న్యాయం పొందాలని కోరారు.