calender_icon.png 11 October, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీలో ఏదో ఉందే లీలా..

09-10-2025 12:14:56 AM

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘తూ మేరా లవర్’, ‘ఓలే ఓలే’ గీతాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం మూడో గీతంగా ‘హుడియో హుడియో’ను విడుదల చేసింది. ‘నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే..’ అంటూ సాగుతోందీ పాట.

ఇందులో ‘అరె నీలో ఏదో ఉందే లీలా.. నన్నే ఏదో చేసిందిలా..’ లాంటి లైన్లు సాహిత్యప్రియుల హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. రవితేజ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఈ గీతానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది. భీమ్స్ సిసిరోలియో స్వరపర్చిన ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆలపించగా, దేవ్ రాశారు. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; మాటలు: నందు సవిరిగాన; డీవోపీ: విధు అయ్యన్న; ఎడిటింగ్: నవీన్ నూలి; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల.