calender_icon.png 29 May, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారూ.. జర న్యాయం చేయుండ్రి..

28-05-2025 12:00:00 AM

ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇప్పల్ నవేగాం గ్రామస్తుల ఆందోళన

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 27 ( విజ యక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నవేగాం గ్రామస్తులు మంగళవారం ఆర్డివో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తాతల కాలం నుండి గ్రామంలో నివసిస్తున్న తమను ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా స్థిరనివాసం ఏర్పరచుకొని జీవనం గడుపుతున్న తమను ఉన్నపలంగా వెళ్ళిపోవాలని హుకుం జారీ చేస్తున్నారని అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట దాదాపుగా గంటసేపు ఆందోళన చేపట్టగా  ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.

వర్షం కురవడంతో చేసేది ఏమీ లేక వెనిదిరిగి వెళ్ళిపోయారు. వీరికి జాతీయ  హుమెన్ రైట్స్ కమిషన్ జిల్లా చైర్మన్ రమేష్ మద్దతు పలికారు. అమాయకమైన ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.