calender_icon.png 31 January, 2026 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. పనికిమాలిన చర్య

31-01-2026 02:09:46 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. శుక్రవారం మాజీ మంత్రి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పనికిమాలిన చర్య అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకు లు ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, యా సం  నర్సింగ్ రావు, సాజిదొద్దిన్, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.