31-01-2026 02:08:51 AM
ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరణ
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూ ళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్‌ను ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదలచేశారు. ఆరో తరగ తిలో చేరే విద్యార్థులకు ఉదయం సెషనల్ లో 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు, ఏడు నుంచి పదో తరగతిలో చేరే విద్యార్థులకు మధ్యాహ్నం సెషన్‌లో 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. ఓసీ విద్యార్థులకు అడ్మి షన్ టెస్టు ఫీజు రూ.200 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.125 ఫీజుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28.