calender_icon.png 7 July, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు రోజులు వర్షాలు

28-08-2024 12:00:00 AM

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): మరో ఆరు రోజులు రాష్ట్రం లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ దురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాలో కురుస్తాయని వెల్లడించింది. వరంగల్, హనుమకొండ, జనగామ, ఆదిలాబాద్, క్రు మంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల, రా జన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో ఈదురుగా లులతో వానలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల పిడుగు లు పడే అవకాశం ఉండటంతో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.