26-11-2025 11:00:10 PM
స్కూల్ లో ఆడుకుంటుండగా ఘటన..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): స్కూల్ లో ఆడుకుంటుండగా ఓ విద్యార్థిని పాము కాటేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని సిర్సన్న గ్రామ ప్రైమరీ స్కూల్ మైదానంలో బుధవారం సాయంత్రం విద్యార్థులు క్రికెట్ ఆడుకుంటుండగా బాల్ గ్రౌండ్ బైటకు వెళ్ళడంతో బాల్ కోసం వెళ్ళిన 5వ తరగతి విద్యార్థి అనుష్ చేతిపై పాము కాటేసింది. వెంటనే గమనించిన స్కూల్ సిబ్బంది 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన బాలున్ని రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం బాలుని పరిస్థితి నిలకడగా ఉంది.