calender_icon.png 27 November, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

26-11-2025 11:02:44 PM

సిద్దిపేట: కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట గ్రామంలో మియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మియా ఫౌండేషన్ ఎండీ అర్షద్ అలీ ఆధ్వర్యంలో ఆర్వీఎం ఆస్పత్రి వైద్యులు సేవలు అందించారు. ఈ శిబిరంలో కీళ్ల నొప్పులు, గుండె, కిడ్నీ, కాలేయం, బీపీ, షుగర్‌ వంటి పలు రకాల వ్యాధులకు వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. దాదాపు 300 మంది వైద్యసేవలు పొందారని అర్షద్ అలీ తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.