15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇండ్లు కోల్పోతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది

06-02-2026 01:38 AM

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): భద్రకాళి మాఢవీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలతో డబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇండ్లు కోల్పోతున్న వారు తమ అభిప్రాయాలను కలెక్టర్ కు తెలియజేశారు. ఇండ్లు కోల్పోతున్న తమకు మరొకచోట ఇండ్లు ఇవ్వాలని, కల్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.  ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి సిద్ధార్థ నాయక్, మైనింగ్ ఏడి రవిశంకర్, జి డబ్ల్యూఎంసి కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.