calender_icon.png 23 January, 2026 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడిలో పాముల సంచారం

23-01-2026 12:13:02 AM

భయం గుప్పిట్లో విద్యార్థులు

చారకొండ, జనవరి 22: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే సరస్వతి నిలయాలు సమ స్యలతో సతమతమవుతున్నాయి. పాఠశాలలకు సరైన రక్షణ లేకపోవడంతో విద్యార్థులు భయం నీడలో తమ చదువులు సాగిస్తున్నారు. గురువారం మండలంలోని రామ చంద్రాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదిలోకి పాము రావడం తో విద్యార్థులు భయాందోళనకు గురయ్యా రు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో పామును చంపి వేశారు.

పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాటు పరిసరాల చుట్టూ ఏపుగా పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారడంతో పాఠశాల ఆవరణలోనే విష కీటకాలు, పాములు సంచరిస్తుండటంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపు తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహారీ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.