28-01-2026 12:53:46 AM
జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకు లావాదేవీలు
కొత్తగూడెంలో భారీ ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 5 రోజుల బ్యాంకింగ్ విధానంను వెంటనే అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె నిర్వహించారు .ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీని ఉద్దేశించి బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ కార్యదర్శి K. శ్రీకాంత్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్, కార్యదర్శి భవానీ శంకర్, ఎస్బీఐ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈ శాంతి టిసిసిబిఈఏ కార్యదర్శి వి. కృష్ణారావు, డీసీసీబీ, యూనియన్ బ్యాంక్ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పని భారం తగ్గిం చి, పనివ్యక్తిగత జీవన సమతుల్యత సాధించేందుకు 5 రోజుల బ్యాంకింగ్ విధానం అత్యవసరం అని వారు స్పష్టం చేశారు. ఇది ఉద్యోగులకే కాకుండా ప్రజలకు కూడా మే లు చేసే నిర్ణయమని పేర్కొన్నారు. డిమాండ్ను అమలు చేయాలని కోరారు.