calender_icon.png 19 December, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సామాజిక ఐక్యత అవసరం!

16-12-2025 12:00:00 AM

పుల్లెంల గణేష్ :

స్వతంత్ర భారతంలో పార్టీలకతీతంగా ఇప్పటివరకు అగ్రకుల నాయకులే ఎక్కువగా పాలకుల పాత్రను పోషిస్తూ వస్తున్నారు. కానీ ఏ గ్రామాల్లో కూడా ప్రజలకు అవసరమైన ప్రధాన మౌలిక సదుపాయాలైన నాణ్యమైన విద్యను, వైద్యాన్ని, ఉపాధిని, ఇల్లు, భూమిని కల్పించడంలో విఫలమయ్యారు. మరి అగ్రకుల నాయకుల పాపాలకు అణగారిన వర్గాలు రాజకీయంగా శిక్ష వేయాల్సిన అవసరముంది. పరిపాలనలో విద్యావంతమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులు ముందుకు రావడంపై ఆలోచించాలి. ఈ సత్యాన్ని బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాలు గ్రహించాలి.

నేడు తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న సర్పం చ్ ఎన్నికల్లో అగ్రకుల నాయకులు మద్యా న్ని ఏరులై పారిస్తున్నారు.. లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. అయితే వాటిని అరికట్టడంలో రాష్ర్ట ఎన్నికల సం ఘం, రాష్ర్ట పోలీసు విభాగం ఘోరంగా విఫలమవుతున్నట్టుగా నిరూపణవుతున్న ది. అగ్రకుల పాలకవర్గాలు తమ స్వార్ధ రాజకీయాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను సైతం నిర్వీర్యం చేయడం గమనార్హం.

ఒకపక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేస్తామని చెప్పి, హామీని నెరవేర్చడంలో విఫలమైంది. అదే సమయం లో తమ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 56 శాతమున్న బీసీలకు న్యాయం చేయలేకపోయిందనే విమర్శలు వచ్చాయి.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ కూడా బీసీల పక్షాన 42 శాతం రిజర్వేషన్స్ సాధించడం కోసం ఎలాంటి పోరాటం చేయకపోవడాన్ని చూస్తుంటే బీసీలను రాజకీయంగా మోసం చేస్తున్నాయన్న నైజం అగ్రకుల పార్టీల్లో సుస్పష్టంగా కనిపిస్తున్నది. మరి అలాంటప్పుడు బీసీలకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయ శత్రుత్వ పార్టీలు అయినట్లే కదా!.

ఇకనైనా తెలంగాణ రాష్ర్టంలో ఉన్న బలమైన బీసీ నాయకులు హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమాలు చేస్తూ, ప్రెస్‌మీట్‌లకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో అగ్రకుల నాయకులకు దీటుగా బీసీ నాయకులు కూడా తయారయ్యేలా చిన్న, పెద్ద బీసీ సంఘం నాయ కులు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి బలమైన నిర్మాణం గ్రామ స్థాయిలో చేయాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. అప్పుడే గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ దాకా జనాభా దామాషా ప్రకారం బీసీలు తమ రాజకీయ వాటాన్ని పొందగలరు. 

బానిసత్వం వదిలి..

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ.. అగ్రకులా లు తమ దోపిడీ రూపాన్ని మార్చుకుంటున్నాయే తప్ప, గుణాన్ని మార్చుకోలేదని పిస్తుంది. భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగం గా బడుగు బలహీన వర్గాలకు విద్య లేకపోవడం, భూమి లేకపోవడం, శిస్తుకట్టే శక్తి లేకపోవడం అనే అంశాలను అడ్డుపెట్టి అగ్రకులాలకు మాత్రమే అన్ని హక్కులు అనేలా మాట్లాడుకున్నారు.

ఈ సమయం లో ఒక్క అంబేడ్కర్ మాత్రమే ప్రతి మనిషికి కులం, మతం, ప్రాంతం, లింగం, వర్ణం తారతమ్యాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని, ఒక వ్యక్తికి ఒక ఓటు ఒకే విలువ ఉండాలని కోరుకున్నారు. అగ్రవర్ణాలు, ధనికుల పాలకవర్గా లను తన జ్ఞానంతో ఓడించి మెప్పించడం మూలంగా ఇవాళ అగ్రవర్ణాలతో పాటు సమానంగా అణగారిన వర్గాలకు కూడా ఓటు హక్కు లభించిందని చెప్పొచ్చు.

తద్వారా తరతరాలుగా అగ్రవర్ణాల చేత పీడితులైన ఎస్సీ ఎస్టీలు తమ ఓట్లు తమ వేసుకొని గ్రామస్థాయి నుండి పార్లమెం టు వరకు పరిపాలకులుగా ఉంటారని అంబేడ్కర్ భావించారు. అంబేడ్కర్ కృషి, త్యాగం మూలంగా విద్యావంతులైన అణగారిన వర్గాలు వ్యక్తులు.. అగ్రవర్ణాల పాల కుల చెప్పుచేతల్లో ఉంటూ తమ సామాజిక వర్గానికే చెందిన నిరక్షరాస్యులైన ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓటర్లను తాకట్టు పెట్టే దళారులుగా వ్యవహరిస్తూ వచ్చారు.

మరోపక్క నిరక్షరాస్యులైన సబ్బండ కులాల తల్లిదండ్రులకి అగ్రవర్ణాలు వేసిన మానసిక బానిస సంకెళ్ల నుంచి విముక్తులను చేయాలన్న విషయం మరిచిపో యారు. తమ పూర్వీకులు ఆయా అగ్రకుల పార్టీలకి తరతరాలుగా ఓట్లు వేసుకుంటూ రావడం, అలాంటి నీచపు వారసత్వ రాజకీయ బానిసత్వాన్ని ఉన్నత విద్యను అభ్య సించిన బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యావంతులు కూడా అగ్ర కులాలు ఇచ్చే మందు, మాంసం, డబ్బు ప్రలోభాలకు గురయ్యి సొంత కన్నునే పొడుచుకోవడానికి సిద్ధమయ్యారు.

దీనివల్ల అణగారిన వర్గాల్లో చదు వుకున్నప్పటికీ అగ్రవర్ణాల నాయకుల చేతి లో కీలుబొమ్మలుగా మారిపోయి వారికి ఊడిగం చేయడమే విద్యావంతులు లక్ష్యం గా పెట్టుకోవడం సిగ్గుచేటు అని చెప్పవచ్చు. ఒక రకంగా విద్యావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు మందు, మాంసం, డబ్బు వంటి ప్రలోభాలకు గురై ఓటును అమ్ముకోవడం తమ వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం కిందకే వస్తుంది. దీంతో అణగారిణ వర్గా ల్లో క్రమశిక్షణ, ఐక్యత, చైతన్యం లేదన్న విషయం మనకు మనమే రుజువు చేసుకున్నట్లయింది.

సొంత ప్రయోజనాల కోసం..

అగ్రకుల నాయకులు తమ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అణగారిన వర్గాలకు చేసిన చిన్న చిన్న మేలుని గుర్తు పెట్టుకొని నేటికి అదే అగ్రకుల నాయకులకి సబ్బండ కులాల తల్లిదండ్రు లు, విద్యావంతులైన వారి బిడ్డలు కృతజ్ఞు లై ఉంటున్నారు.  ఇప్పటికీ అలాంటి అగ్రవర్ణ నాయకులనే గ్రామస్థాయి సర్పంచ్ పీఠం నుంచి పార్లమెంట్ వరకు ప్రోత్సహిస్తుండడం చూస్తుంటే అణగారిన వర్గాల కోసం పాటుపడిన అంబేడ్కర్, కాన్షీరాం వంటి మహనీయుల కృషి, త్యాగం వృథా గా మారిపోయినట్లే. 

ఒకవేళ  వాళ్లు పోరాడకపోయి ఉంటే అసలు ఇవాళ అగ్రవర్ణాలతో పాటు సమానంగా అణగారిన వర్గాలకి ఓటు హక్కు వచ్చి ఉండేదా అన్న విష యాన్ని గ్రహించాల్సిన అవసరముంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఓటు హక్కు ఉందన్న ఒక్క కారణంతోనే ఇవాళ అగ్రకుల నాయకులు అణగారిన వర్గాల గడప దాకా వచ్చి ఓట్లకోసం బేరసారాలు చేస్తున్నారు. ఈ చారిత్రక సత్యాన్ని విద్యావంతులైన బీసీ, ఎస్సీ ఎస్టీ యువకులు విచక్షణా జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరముంది. అణగారిన వర్గాల కోసం పోరాడిన మహ నీయుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులు.. అగ్రకుల నాయకులకు చెంచెలుగా కొనసాగడం మానేసి సొంత రాజకీ య ప్రయోజ నాల కోసం అడుగులు వేయాలి. 

తక్షణ కర్తవ్యం..

అంతిమంగా రాజకీయాలు అంటే అగ్రకులాలకు మాత్రమే సొంతం కాదు, ప్రతి సామాన్యుడు సింహాసనం మీద కూర్చునేలా ప్రభుత్వ పాలనా వ్యవస్థ ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అగ్రకులకు నాయకులకు దీటుగా అణగారిన వర్గాల నాయకులు కూడా సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్యం, గణతంత్ర విలువలతో భారత రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు బలమైన ఆయుధాలు ఇచ్చి అసమానత విలువలు కలిగిన భారతీయ కుల వ్యవస్థని ఢీ కొట్టడానికి ఓటు అనే వజ్రాయుదాన్ని అంబేద్కర్ అణగారిన వర్గాల చేతుల్లో పెట్టారు. 

మరి అలాంటి ఓటుతో పోరాడి రాజులవుతారో? అమ్ముకొని బానిసలవుతారో తేల్చుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీల ముందు బల మైన లక్ష్యాన్ని నిర్దేశించారు. 

కాబట్టి అంబేడ్కర్ కృషి, త్యాగం ద్వారా నేటి భౌతిక ప్రపంచంలో మనుగడ కొనసాగిస్తున్న అణగారిన వర్గాల ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే.. అగ్రకుల నాయకులకు దీటుగా స్వశక్తిగా, స్వధర్మంతో స్వీయ రాజకీయ వేదికగా భారత రాజ్యాంగ బద్ధ, ప్రజాస్వామ్య రాజకీయా ల కోసం పాటుపడాలి. శాంతియుతంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన తీసుకొచ్చేలా కృషి చేయడమే నేడు అణగారిన వర్గాల తక్షణ కర్తవ్యమని గుర్తించాల్సిన అవసరముంది.

వ్యాసకర్త సెల్: 9553041549