20-09-2025 12:00:00 AM
రైతులకు రూ.55.71 లక్షల విలువచేసే వ్యవసాయ పరికరాల మంజూరి పాంత్రాలు అందించిన ఎమ్మెల్యే
లక్ష్మీదేవిపల్లి/భద్రాద్రికొత్తగూడెం, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : రహదారుల సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ముందస్తు ప్రణాళికతో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా అభివృద్ధి జరుగుతున్న పనుల దృశ్యాలు దర్శనమిస్తాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.
లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని బంగారుచెలక, లక్ష్మీపురం, మైలారం, రేగళ్ల, గట్టుమల్ల గ్రామపంచాయితీల పరిధిలో రూ.1.48కోట్ల డిఎంఎఫ్టి, ఎన్‌ఆర్‌ఈజిఎస్, ఎస్సిపి నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూర్తయిన పనులను ప్రారంభించారు.
ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని రేగళ్ల-కరకవాగు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగుకు రూ.10కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ రోడ్డు పూర్తయితే రవాణ సమస్యకు పరిస్కారం లభిస్తుందన్నారు. గ్రామాల అనుసంధాన రోడ్లు, అంతర్గత రహదారులు, ప్రధాన రహదారులు పటిష్టంగా నిర్మిస్తామని, భవిష్యత్తులు రవాణ సమస్యలు లేకుండా పరిస్కారం చూపెడతామన్నారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, నాయకులు దారా శ్రీను, కంటెం సత్యనారాయణ, జోగా రామయ్య, నూనావత్ గోవిందు, కోడి లింగయ్య, పరుపర్తి రాజు, జోగా రాజబాబు, రమేష్, సర్వాన్, శాపావత్ రవి, జర్పుల ఉపేందర్, మాడెం ప్రసాద్, రాంబాబు, లక్ష్మీనారాయణ, ముత్తయ్య, మోహన్, ఎంపిడివో అంకుబాబు, ఆర్‌ఐ ప్రవీణ్, అధికారులు రవి, వీరన్న, మహాలక్ష్మి, శివలాల్, మెస్సు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనపై ద్రుష్టి సారించా..
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.4.50కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చుంచుపల్లి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : పేద విద్యార్థులు విద్యనభ్యసించే ప్రభుత్వ విద్యాసంస్థల్లో సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ప్రభుత్వ జూని యర్ కళాశాలలో రూ.3.92కోట్ల టిజిబిఐ ఈ నిధులతో నిర్మించనున్న నూతన భవనాల సముదాయానికి, రూ.58 లక్షల వ్యయంతో చేపట్టనునన్న మరమ్మత్తు పనులకు శుక్రవారం అయన శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సకల సౌకర్యాలు కల్పించయేందుకు కృషి చేస్తున్నానని, ప్రైవేటుకు ధీటుగా పేద విద్యార్థులకు విద్య నందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపా రు. అసౌకర్యాల వల్ల పెదవిద్యార్థులు విద్య కు దూరమయ్యే పరిస్థితులను అధిగమించాల్సి అవసరం ఉందని, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు.
కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వేలాదిమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించిందని, ఉన్నత హొదాలో ఈ కళాశాల చదివిన విద్యార్థులు ఉన్నారని, ఎలాంటి విద్యాసంస్థను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుజాతనగర్ లో జూనియర్ కళాశాలను మంజూరు చే యించడం జరిగిందని, మైనార్టీ రెసిడెంటిల్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాల, రామచంద్ర డిగ్రీ కళాశాల, పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ పాఠశాలల్లో ఎప్పటికి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
పనులను నాణ్యతగా చేపట్టాలని, త్వరితగతిన పనులు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, ఆర్డీ వో మధు, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ కత్తి రమేష్, ఈఈ కె బుగ్గయ్య, డీఈ నాగేశ్వరాచారి, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ పుల్ల య్య, పంచాయతిరాజ్, విద్యాశాఖ అధికారులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.