20-09-2025 12:00:00 AM
సహకార సంఘం అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి
భీమదేవరపల్లి,సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలోని రైతులకు ఎలాంటి యూరియా కొరత రాకుండా నేటి వరకు 40,000 బస్తాల యూరియా రైతులకు సరఫరా చేయడం జరిగిందని మునుగనురు సహకార సంఘం అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార సంఘం లో మాట్లాడుతూ సంఘంలోని 75 లకు 82 వేల బస్తాల ఫర్టిలైజర్ రైతులకు అందజేయడం జరిగిందన్నారు సహకార సంఘంలోని రైతులకు యూరియా కొరత రాకుండా ముందస్తుగానే వ్యవసాయ శాఖ కమిషనర్ తో ప్రత్యేకంగా మాట్లాడి సంఘ సభ్యులకు యూరియా కొరత రాకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు.
సహకార బ్యాంకులోని రైతులు 20వేల ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక కోటి 7 లక్షల వ్యయంతో 40 వేల బస్తాలు యూరియా తెప్పించి రైతాంగానికి అందించమన్నారు. త్వరలోనే బ్యాంకు పరిధిలోని రత్నగిరి, జగన్నాధ పూర్ గ్రామాల్లో రైతుల పంట నిల్వలు నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించడం జరుగుతుందన్నారు.
అలాగే సహకార సంఘానికి వస్తున్న ఇతర దేశాల వారి కోసం డైనింగ్ హాల్ నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. సమావేశంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.