20 March, 2026 | 4:32 AM

నెల్లూరులో కూల్‌డ్రింక్స్ లారీ బోల్తా

20-03-2026 01:18 AM

బాటిళ్లను తీసుకెళ్లిన జనాలు

అమరావతి, మార్చి 19: నెల్లూరులో కూల్‌డ్రింక్స్ లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడి వాహనంలోని కూల్‌డ్రింక్స్ బాటిళ్లు రో డ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన ఘటన గురువారం చోటు చేసుకుంది. థమ్స్ అప్ లోడ్‌తో వెళ్తున్న లారీ నగర శివార్‌లోని బుజబుజ నెల్లూరు హైవేపై పక్కకు పల్టీకొట్టిం ది. ఈ ప్రమాదంలో లారీలోని క్రేట్లు, బాటి ళ్లు రోడ్డుపై పడిపోయాయి. స్థానికులు, వాహనదారులు భారీసంఖ్యలో వచ్చి, వాటిని కేవలం 10 నిమిషాల్లోనే ఖాళీ చేసి తీసుకెళ్లారు. లారీలోని సరుకంతా పోయింద ని డ్రైవర్ లబోదిబోమన్నాడు.