calender_icon.png 26 July, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన సోలార్ కార్మికులు

09-01-2025 05:32:10 PM

సీఐటీయూ, టియుసీఐ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా...

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మాణం చేసింది. ఈ సోలార్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధహక్కులు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఫ్యాక్టరీల చట్టాన్ని అమలుచేయడాన్ని నిరసిస్తూ గురువారం ఇల్లందు జిఎం కార్యాలయం ముందు సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘాల కార్మికులు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం జిఎం వీసం కృష్ణయ్యకి వినతిపత్రం అందజేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి బి మధు, అబ్దుల్ నబి, టియుసిఐ అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి, మల్లెల వెంకటేశ్వర్లు అనంతరం డిజిఎం పర్సనల్ మోహన్ రావు, బీహెచ్ఈఎల్ సూపర్వైజర్ క్రాంతి, యూనియన్ల నాయకులతో చర్చలు జరిపారు. సోలార్ కార్మికులకు సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న వేతన జీవో ప్రకారం సోలార్ కార్మికులకు ఇవ్వాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.

లాభాలలో వాటా స్పెషల్ ఇన్సెంటివ్ 5వేల రూపాయలు సోలార్ కార్మికులకు ఇవ్వాలన్నారు. సెక్యూరిటీ గార్డులకు మూడు షిఫ్టుల డ్యూటీ కేటాయించాలన్నారు. సోలార్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి క్యాటగిరి వారిగా పనులు కేటాయించాలన్నారు. సోలార్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ తగ్గటం వలన దొంగతనాలు జరుగుతున్నాయని దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచాలని కోరారు. 2023, 2024 సంవత్సరానికి సంబంధించి బోనస్ ఇవ్వాలని కోరగా పర్సనల్ మేనేజర్ గతంలో ఉన్న కాంట్రాక్టర్ ను రద్దుచేసి కొత్తగా సెంట్రల్ జీవో అమలు తదితర హక్కులు అమలు చేసే విధంగా టెండర్ కోడ్ లో పెట్టి టెండర్ పిలవాలని బిహెచ్ఇఎల్ సూపర్వైజర్ కి తెలిపారు. ఈ విషయాన్ని కార్పొరేట్ పై అధికారుల చేతిలో ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని కోరడం వలన ధర్నా విరమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సోలార్ యూనియన్ ఇరుసంఘాల కార్మిక నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు తాళ్లూరి కృష్ణ, సంజీవ్ రామకృష్ణ, ప్రేమ్ సింగ్, రాజు, శ్యాం బాబు, దల్సింగ్, గణేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.