calender_icon.png 24 October, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు

23-10-2025 12:45:54 AM

ఒకో బల్దియాకు రూ.15 కోట్ల చొప్పున నిధులు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఆరు మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా మొత్తం రూ.90 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (మున్సిపల్ శాఖ) ఉత్తర్వులు జారీచేసింది.  ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున కేటాయించింది.

ఈ నిధులను దేవరకద్ర, అలియా బాద్, గడ్డ పోతారం, గుమ్మడిదల, కోహిర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో ఆయా మున్సిపా లిటీల్లో మెయిన్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయి న్లు, ఫుట్‌పాత్‌లు, వరద నీటి డ్రెయిన్లు, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు, వాటర్ సప్లు పనులను చేపట్టనున్నారు.