calender_icon.png 25 August, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరేడ్‌మెట్ సమస్యలు పరిష్కరించండి

25-08-2025 02:03:41 AM

ఎంపీ ఈటలకు స్థానికుల వినతి

మల్కాజిగిరి, ఆగస్టు 24 : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ని ఆదివారం శామీర్పేట నివాసంలో కలసిన నేరేడ్మెట్ డివిజన్ బీజేపీ నాయకులు స్థానిక సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేరేడ్మెట్ డివిజన్లోని మూడు కాలనీలలో ఇప్పటికే బోరు మరమ్మత్తుల కోసం పనులు మంజూరయ్యాయని, అయి తే ప్రభుత్వ పీహచ్‌సీలో కూడా తీవ్రమైన నీటి సమస్య ఉందని వివరించారు.

దీనిపై ఎంపీ ఫండ్స్ నుంచి కొత్త బోరు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ ఆరోగ్య కేంద్రంలో నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని నూతన బోరు ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి బీజేపీ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, మల్లిక, శర్మ తదితరులు పాల్గొన్నారు.