25-08-2025 02:02:34 AM
ముషీరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మనిషికి అన్ని ఉన్నా స్వేచ్ఛ కోసం జీవిస్తారని కానీ జైలులో స్వేచ్ఛ ఉండదని విశ్రాంత జడ్జి, ప్రముఖ రచయిత డా.మం గారి రాజేంద్ర ’జింబో’ అన్నారు. అదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కె.రాజన్న హిందీ మూలం ఫాంసీని డాక్టర్ కారం శంకర్ తెలుగు అనువాదం ఊరికంభం నీడలో ఒక బహుజనుడి ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా హాజరైన వక్తలు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉరికంభం నీడలో బహుజనుడి ఆత్మకథ పుస్తకం నిలుస్తుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ హరించడం వేదనకు గురిచేస్తుందని, అది రాజన్న జీవితంలో కనిపిస్తుందని అన్నారు. జైలు జీవి తం ఆయనను మంచి రచయితగా చేసిందన్నారు. సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న పుస్తకంలో సామాజిక చరిత్ర, నవల అంశం ఆసక్తికర సంఘటనలు ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి మంచి సాహిత్యం రాలేదని డాక్యుమెంట్ నవల ఈ పుస్తకం అన్నారు.
ఆదిలాబాద్ నుంచి మంచి పుస్తకం తీసుకురావడం అభినందనీయం అన్నారు. మానవీయమైన స్పర్శ ఈ పుస్తకంలో ఉందన్నా రు. సమాజ చరిత్రను ముఖ్యమైన కోణం నుంచి ఆవిష్కరించారని అన్నారు. వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ జైలు జీవితం మానవ సంబందా లను దూరం చేస్తాయన్నారు. జైలు జీవితం గడిపిన రాజన్న ఉన్నత రచయితగా ఎదిగారని అన్నారు. ఆడిషనల్ జిల్లా కలెక్టర్ ఏను గు నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాజన్న పుస్తకం ఇంగ్లీషులో కూడా అనువదించాలని అన్నారు.
భారత రాజ్యాంగం వల్లనే రాజన్న మరణశిక్ష నుంచి విముక్తి పొందారని ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మరణశిక్ష అవసరం లేదని ఈ సస్తరం చాటి చెప్పిందన్నారు. ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ సాధారణ జీవి ఆసాధారణ జీవిగా ఎదిగారని జైలులో ఉండి ఎదగడం గొప్ప విశేషమన్నారు. విద్య విజ్ఞానం గొప్ప జీవితంగా మలుపు తిప్పుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సాహిత్యకారులు డాక్టర్ అహిల్యా మిశ్రా, హిందీ కథాకారులు ఎస్.ఆర్.శ్యామ్, దళిత నాయకుడు కాంతం ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.