24-10-2025 01:00:09 AM
రావల్పిండి, అక్టోబర్ 23: సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఘోరపరాభవం ఎదురైంది. తొలి టెస్టులో గెలిచి సిరీస్‌పై కన్నేసిన పాక్ జట్టును దక్షిణాఫ్రికా దెబ్బకు దెబ్బ కొట్టింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో పాక్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో టెయిలెండర్లు కూడా అదరగొట్టడం తో సౌతాఫ్రికా 404 పరుగుల భారీస్కోరుకు ఆలౌటైంది.
దీంతో 71 పరుగుల కీలక మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ము ఖ్యంగా కగిసో రబాడ మెరుపు ఇన్నింగ్స్ హై లెట్‌గా నిలిచింది. రబాడ కేవలం 61 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను సఫారీ స్పిన్నర్ హార్మర్ చావుదెబ్బ కొట్టాడు. 6 వికెట్లతో పాక్ ఇన్నింగ్స్‌ను శాసించాడు. ఫలితంగా పాక్ కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. తర్వాత 73 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.