24-10-2025 01:03:13 AM
-మహిళల వన్డే ప్రపంచకప్
-న్యూజిలాండ్‌పై ఘనవిజయం
-శతక్కొట్టిన మంధాన, ప్రతీకా
నవీ ముంబై, అక్టోబర్ 23: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్ళింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలువిదిల్చి న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగిపోగా.. బౌలర్లు సమిష్టిగా రాణించి కివీస్‌ను దెబ్బకొట్టారు. ఫలితంగా భారత్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా..కివీస్ నిష్క్రమించింది. స్మృతి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తే... ప్రతీకా ఈ మెగాటోర్నీలో తొలిసారి దుమ్మురేపింది.ఆరంభం నుంచే కివీస్ బౌలర్లను వీరిద్దరూ ఓ ఆటాడుకున్నారు.
తొలి వికెట్‌కు మంధాన , ప్రతీకా 212 పరుగుల రికార్డు భాగస్వామం నెలకొల్పారు. 92 బంతుల్లో శతకం సాధించిన మంధాన 109(10 ఫోర్లు,4 సిక్సర్లు) రన్స్‌కు ఔటైంది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె పలు రికార్డులను సొంతం చేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. స్మృతి మరో శతకం బాదితే మెగ్ లానింగ్(15) సెంచరీల రికార్డును అందుకుంటుంది. అలాగే ఒకే క్యా లెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును సైతం సమం చేసింది. అటు తొలిసారి వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ చేసిన ప్రతీకా 122 రన్స్‌కు ఔటైంది. తర్వాత జెమీ మా రోడ్రిగ్స్(76) ధాటిగా ఆడడంతో భార త్ 49 ఓవర్లలో 340/9 రన్స్ చేసింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు ముందు కూ డా వర్షం అడ్డుపడడంతో టార్గెట్‌ను 44 ఓవర్లలో 325 రన్స్‌గా నిర్ణయించారు. కివీస్ 44 ఓవర్లలో 271 పరుగులే చేయగలింది. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండ గానే సెమీస్ బెర్త్ ఖా యం చేసుకుం ది. ఒకవేళ ఆదివారం ఇం గ్లాండ్‌పై కివీస్ గెలిచి, బంగ్లా చేతిలో భారత్ ఓడిపోయినా కూడా న్యూజిలాండ్ సెమీస్ చేరలేదు. ఎం దుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం నెట్న్ రేట్ కంటే ముం దు లీగ్ స్టేజ్‌లో ఎవరూ ఎక్కువ విజయాలు సాధించారనేది పరిగణలోకి తీసుకుంటారు. ఈ కారణంగా భారత్ చివరి సెమీస్ బెర్తును దక్కించుకుంది.
స్కోర్లు :
భారత మహిళల ఇన్నింగ్స్ : 340/3 (49 ఓవర్లు)(ప్రతీకా122, స్మృతి 109, జెమీమా 76; మైర్ 1/52, కెర్ 1/69, బేట్స్ 1/40)
కివీస్ మహిళల ఇన్నింగ్స్ : 8/271(44 ఓవర్లు)( హల్లీడే 81, గేజ్ 65 , కెర్ 45; రేణుక 2/25, ప్రతీకా 1/19, క్రాంతి 2/48)