calender_icon.png 15 December, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని చూసి పార్టీలో చేరికలు

15-12-2025 06:24:11 PM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

మల్యాల (విజయక్రాంతి): మల్యాల, గంగాధర ప్రజా కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మల్యాల మండలం మనాల గ్రామ సర్పంచ్ బల్మూరి పాపారావు, ఉప సర్పంచ్ ఎడపల్లి జమున సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా గంగాధర ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలన అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. వర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.