15-12-2025 06:00:55 PM
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని సోమవారం మధ్యాహ్నం ఇటీవలే విడుదలయిన మోగ్లీ చిత్రం హీరో శ్రీ రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్ మరియు చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్లు చిత్రం పెద్ద హిట్ కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తానుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, గౌండ్ల స్రవంతి, అసంతుల శ్రీనివాస్, పర్యవేక్షకులు కొంతికుమార్, సిబ్బంది తదితరులున్నారు.