calender_icon.png 15 December, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ భవన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

15-12-2025 06:51:16 PM

హనుమకొండ (విజయక్రాంతి): భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లబాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ భవన్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్య్రం అనంతరం దేశం చీలిపోయే పరిస్థితుల్లో, 562 సంస్థానాలను ఒకే భారతదేశంగా ఏకం చేసిన మహానేత సర్దార్ పటేల్. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చూపిన దృఢ సంకల్పం ఈ రోజుకీ మనకు మార్గదర్శకం అన్నారు.

దేశం ముందు – వ్యక్తి తర్వాత అనే సిద్ధాంతంతో జాతి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. నిర్ణయాలలో దృఢత్వం, పాలనలో క్రమశిక్షణ, దేశంపై అపారమైన ప్రేమ –ఇవి సర్దార్ పటేల్ వ్యక్తిత్వానికి చిరస్థాయిగా నిలిచిన లక్షణాలనీ, పార్టీలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా దేశం ముందుకు సాగాలంటే అందరం కలసి నడవాలన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, ప్రజా సేవ, దేశ నిర్మాణం, ఐక్యత కోసం మన వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వీ శ్రీనివాస్ రావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్ జక్కుల రవీందర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గాండ్ల స్రవంతి, ఝాన్సీ, బ్లాక్ అధ్యక్షులు సంపత్, రాజు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.