calender_icon.png 15 December, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మాజీ మేయర్ అజయ్ యాదవ్

15-12-2025 05:58:12 PM

మేడిపల్లి (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ బంగారు మైసమ్మ దేవాలయం నుండి చెంగిచెర్ల రోడ్డు వెడల్పు చేపడుతున్న పనులను బోడుప్పల్ మున్సిపల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, హెచ్ఎండిఏ ఈఈ శ్రీనివాస్, డిఈ సత్య ప్రసాద్, ఏఈ విశ్వజిత్ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ యాదవ్, రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్న విధానాన్ని పరిశీలించారు.

రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజ్ సదుపాయాలు, నాణ్యత ప్రమాణాలను పాటించాలని పలు సూచనలు చేశారు. రోడ్డ దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా తొందరగా పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా, డ్రైనేజీ వ్యవస్థ సరైన విధంగా ఉండాలని అధికారులను కోరమని దానికి సానుకూలంగా స్పందించారని అజయ్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.