15-12-2025 05:49:24 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం నుండి శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వాములు బయలుదేరారు. సోమవారం పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మిట్టపల్లి మురళీధర్, సాయిరి మహేందర్ గురు స్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని రైలులో తరలివెళ్లారు. శబరిమలైకి వెళ్లిన వారిలో ఏల్ల శాంతయ్య గురుస్వామి, పల్లెపాటి తిరుపతిరావు గురుస్వామి, పల్లెపాటి ప్రభాకర్ గురుస్వామి, ఎల్లంకి రాజన్న కత్తి స్వామి, రామరావుస్వామి, కన్నెస్వామి హర్షిత్ సాయి స్వామి, రాఘవాచారి స్వామి, అయ్యప్ప దర్శనానికి బయలుదేరి వెళ్లారు.