15-12-2025 06:05:33 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాలవంచలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయములో మంగళవారం నుంచి జనవరి 14, 2026 వరకు(16-12-2025 నుండి 14-01-2026 వరకూ) ధనుర్మాస మహోత్సవములు అత్యంత వైభవోపేతముగా నిర్వహించనున్నారు. ఈ ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 06:00లకు స్వామి వారికి పంచామృతాభిషేకము, సాయంత్రం 6 గంటల నుండి ధనుర్మాస మహోత్సవములు ప్రారంభము.
ప్రతిరోజు ఉదయం 04: 30 గంటలకు సుప్రభాతము, ఆరాధన, అనంతరం 05:30 నిమిషాల నుండి తిరుప్పావై సేవా కాలము, 06:30 నిమిషాలకు తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయం స్వామి వారి ఆరాధనలో భక్తుల యొక్క గోత్రనామములతో అర్చన నిర్వహించబడుతుంది. కావున భక్తులంతా ఈ ధనుర్మాస మహోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాము.