05-08-2025 12:08:37 AM
సూర్యాపేట, ఆగస్టు 4 (విజయక్రాంతి) : పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా సోమవారం ఎస్పి నరసింహ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా . సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు, అనంతరం స్టేషన్ రికారడ్స్, పరిసరాలు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ మ్యాప్ ను, గ్రామాల హద్దులను, కేసు ఫైల్స్ ను, కోర్టు వ్యవహారాలు, రిసెప్షన్, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను ఆరాధించారు.
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని పని చేయాలనీ, రౌడి షిటర్స్, సస్పెక్ట్ పై, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిధిలో గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో పెట్రోలింగ్, తనిఖీలు నిరంతరంగా చేయాలని ఆదేశించారు. పెండింగ్ ఉండకుండా ప్రణాళిక ప్రకారం పని చేయాలన్నారు. ప్రజా పిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి, మహిళా కేసుల్లో ప్రణాళిక ప్రకారం పని చేయాలి.
ప్రతి విషయమును రికార్డ్ లో నమోదు పరచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాద పూర్వకముగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫోన్ లు పోగొట్టుకున్న 101 మంది బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈయన వెంట డి.ఎస్.పి ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్, ఎస్త్స్ర బాలు నాయక్, డి సి ఆర్ బి ఎస్‌ఐ యాకూబ్, సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.