calender_icon.png 29 August, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ బూత్ ఏర్పాటు చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం

29-08-2025 08:41:51 PM

జీడీపల్లె గ్రామస్తుల తీర్మానం

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో గల జీడీపల్లె గ్రామంలో ఎన్నికల పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలనీ గ్రామస్థులు డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని తీర్మానించారు. ఈమేరకు జీడీపల్లె గ్రామస్తులు శుక్రవారం తాహసిల్దార్ సుభాష్ చంద్రకు అతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జీడిపల్లె గ్రామంలో వంద శాతం ఆదివాసీ గిరిజనులున్నారని, దాదాపు 300 వందలు ఓటర్లు ఉన్నారన్నారు.

ఎన్నికల్లో ఓటు వేయడానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరత్వాడ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుందని దాంతో గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జీడిపల్లె గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇకనైనా ఎన్నికల అధికారులు కల్పించుకుని పోలింగ్ బూత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.