29-08-2025 07:01:05 PM
మహిళ సాధికారత కేంద్రం స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ సుమ
వనపర్తి,(విజయక్రాంతి): బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించి తమ పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటు ఇవ్వాలని మహిళా సాధికార శాఖ కేంద్రం స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిట్రసి సుమ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద మందడి మండలంలోని దోడగుంటపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సెక్టార్ మీటింగు లో పాల్గొని అంగన్వాడీ టీచర్స్ కు ఆర్థిక అక్షరాస్యత, బాల్య వివాహలపై అవగాహన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్, బాలల చట్టాలు, చైల్డ్ లేబర్, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఆడ పిల్లలను చదివించాలని, ఆడపిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే అన్ని రకాల పథకాలు, రుణాలు, బీమా సదుపాయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
సుకన్య సమృద్ధి యోజన, ముద్ర, పిఎంకెవివై, పీఎం జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన, పీఎం సురక్ష బీమా యోజన ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లో పెంపొందించడానికి ఆర్థిక మోసాలను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ సుధ, అంగన్వాడి యూనియన్ పెద్ద మందడి మండల అధ్యక్షులు నారాయణమ్మ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.