calender_icon.png 5 October, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ

05-10-2025 12:00:00 AM

క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఫిరాయింపు నోటీసులు అందుకు న్న ఎమ్మెల్యేలను.. వారిపై ఫిర్యాదు చేసిన భా రత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తరఫు న్యాయవాదులు అక్టోబర్ 1న స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే సమయం సరిపోకపోవడంతో.. ఆరోజు కేవలం ప్రకాష్‌గౌడ్, కాలె యాదయ్యల క్రాస్ ఎగ్జామినేషన్ మాత్ర మే పూర్తి చేశారు. తిరిగి శనివారం స్పీకర్ సమ యం ఇవ్వడంతో.. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమో హన్‌రెడ్డిలు క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యా రు. పిటిషన్‌దారులైన బీఆర్‌ఎస్ పార్టీ తరఫున న్యాయవాది సోమా భరత్  హాజరయ్యారు. 

అనేక నిజాలు బయటికి వచ్చాయి : సోమా భరత్, బీఆర్‌ఎస్ న్యాయవాది

ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ తరువాత బీఆర్‌ఎస్ తరఫున హాజరైన న్యాయవాది సోమా భరత్ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ..  ఇప్పటి వరకు రాని అనేక విషయాలు బయటికి వచ్చాయని పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమై.. క్రాస్ ఎగ్జామినేషన్‌ను ఎలా ఎదుర్కోవా లనే అంశాలను వివరించారని తెలిపారు. దీని కి సంబంధించిన ఫుటేజీలు కావాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. దీనిపై రేపు పిటిషన్ రూపంలో దాఖలు చేస్తామని సోమా భరత్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్స్ అన్నీ.. ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ పైనే జరిగాయని న్యాయవాది తెలిపారు.

ఇంకా అనేక మంది సాక్షులను విచారణకు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అయితే బార్బడోస్‌లో జరగనున్న స్పీకర్ల సమావేశానికి స్పీకర్ వెళుతున్నారని, అందుకే ఈనెల 24కు తదుపరి విచారణను వాయిదా వేశారన్నారు. ఇప్పటికి కూడా తాము పార్టీ ఫిరాయించలేదని ఎమ్మెల్యేలు ఇంకా బుకాయిస్తున్నారని,  ఏది అడిగినా నిరాకరించడమే పద్ధతిగా పెట్టుకున్నారని సోమా భరత్ పేర్కొన్నారు. రాజీనామాలు చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లండి... అభ్యంతరం లేదు.. కానీ ఇలా చట్టాలను తుంగలో తొక్కొద్దని, అసలు ఫిరాయింపుదారులు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది సోమా భరత్ ప్రశ్నించారు.