28-07-2025 10:36:40 PM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
చివ్వెంల: ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత ఆ పాఠశాలకి సేవ చేయటం అదృష్టం అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) అన్నారు. సోమవారం మండలంలోని కొండలరాయిని గూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జీవితంలో స్థిరపడిన ప్రభుత్వ, ప్రెవేట్ ఉద్యోగులు మండల ప్రాధమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి షూ, టీ షర్ట్స్ పంపిణి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. వీరినీ ఆదర్శంగా తీసుకొని మరింత మంది దాతలు ముందుకు రావాలన్నారు. తదుపరి వనమహోత్సవంలో భాగంగా మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్ రావు, ఎం ఈ ఓ కళరాణి, హెడ్ మాస్టర్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు జానకమ్మ, నాగరాణి, అంగన్వాడీ టీచర్ లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.