calender_icon.png 29 July, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

28-07-2025 10:38:31 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Shabarish) సోమవారం సోమిడి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం రోజున ఎంతమందిని పరీక్షించారు, ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసిన వివరాలను అలాగే ఈ ఔషధీ పోర్టల్ లో నమోదు చేసిన మందుల వివరాలను, సెంట్రల్ మెడికల్ స్టోర్ నుంచి అందుకున్న మందుల వివరాలను, ఇష్యూ చేసిన వివరాలను అలాగే స్టోర్ లో ఉన్న మందులను పరిశీలించారు. టీబీ ముక్త్ అభియాన్ లో ఎంత మందిని పరీక్షించారు, ఏ ఏ హై రిస్క్ గ్రూపుల వారిని పరీక్షించారు, వారి వివరాల నమోదు, పిహెచ్సిలో నమోదు చేసిన గర్భిణీల వివరాలు, వారికి ఇచ్చినటువంటి ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రల వివరాలు, తీవ్ర రక్తహీనతతో ఉన్నవారికి ఐరన్ సూక్రోస్ ఇంజక్షన్ ఇచ్చిన వివరాలు, ఎన్ సి డి లో బిపీ, షుగర్ నిర్ధారణ మందుల పంపిణీ, పేషంట్ బుక్లెట్ లో నమోదు చేస్తున్న ఫాలో అప్ వివరాలను పరిశీలించారు.

టీబీ హై రిస్క్ గ్రూపుల వారికి స్క్రీనింగ్ ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలన్నారు. ఏఎన్ఎం, ఆశలు క్షేత్రస్థాయిలో వారు చేసేటువంటి కార్యక్రమాలు, ఆన్లైన్లో నమోదు చేస్తున్న వివరాలు, అలాగే రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైనటువంటి గర్భిణీ స్త్రీలకు ఏ సేవలు అందిస్తున్నారు, అలాగే ప్రసవానంతర సేవలను ఏ విధంగా అందిస్తున్నారు, వాటికి సంబంధించిన వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో తెలుసుకున్నారు. సమయపాలన, రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ నమోదులో లోపాలపై సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్.అప్పయ్య, డాక్టర్ అనిత , డెమో వి. అశోక్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.