calender_icon.png 11 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

10-10-2025 11:46:33 PM

జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి

నకిరేకల్,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు పదవ తరగతి చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి అన్నారు. శుక్రవారం మండలంలోని చెరువు అన్నారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న లక్ష్య కార్యక్రమాన్ని, గుణాత్మక విద్య అమలుపై సమీక్ష నిర్వహించారు.

తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను చదివించి వారి పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారి సందేహాలను నివృత్తి చేసి వారు విద్యలో ముందుకు వెళ్లే విధంగా కృషి చేయాలని సూచించారు.ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ కార్యక్రమాన్ని తనిఖీ చేసి, విద్యార్థుల నేర్చుకునే స్థాయిని అంచనా వేశారు.