calender_icon.png 24 September, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల సంరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

24-09-2025 12:20:23 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, సెప్టెంబర్ 23  ( విజయక్రాంతి ) : పోషణ మాసం, బేటి బచావో - బేటి పడా వో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా సంక్షే మ శాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమం అదే విధంగా బేటి బచావో బేటి పడావో కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ తన ఛాంబర్ లో ఆవిష్కరిం చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి, సిబ్బందికి దిశా నిర్దేశం చేశా రు. పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం, లో పం వల్ల జరిగే అనర్థాల పై కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు ప్రతి అమ్మాయి చదువులోనే కొనసాగే విధంగా చూడాలని సూచించారు. ఎక్క డైనా బాల్య వివాహాలు నిర్వహించే పరిస్థితులు ఉంటే ముందే అరికట్టే విధంగా జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు. పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డీఆర్డీఓ ఉమా దేవి, డి.సి.పి. ఒ రాంబాబు, సి.డి.పి. ఒ లు, సిబ్బంది పాల్గొన్నారు.