calender_icon.png 24 September, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తాం

24-09-2025 12:20:46 AM

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్కిల్ వారీగా బతుకమ్మ పోటీలు నిర్వహించనున్నట్లు నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి తెలిపారు. బుధవారం బతుకమ్మ కార్యక్రమం సికింద్రాబాద్ సర్కిల్  సీతాఫల్‌మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో జరగనుందని సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనాథ్‌కు తెలిపారు.

బతుకమ్మ పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, వేడుక ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్య సదుపాయాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పి ంచాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువ తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.