14-10-2025 01:03:59 AM
కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాం తి): ఆదిలాబాద్‌లోని డైట్ కళాశాలలో ఐఈ ఆర్‌పీఎస్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌లకు ప్రశస్త యాప్, సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ టైటిల్మెం ట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పైన ఓరియంటేషన్ ట్రైనింగ్ నిర్వహించారు. సోమ వారం ఈ ట్రైనింగ్‌కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, భవిత కేంద్రం ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, శిక్షణా నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు.
ఈ సందర్భంగా ట్రైనింగ్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ టీచర్లకు నిర్వహించే ఈ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ప్రత్యే క అవసరాలు గల పిల్లల విద్యా, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచడం జరుగుతోందన్నారు.
సిడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య పై ఐఆర్పిఎస్ స్పెషలైజేటర్స్ కు సూచనలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని, జిల్లా విద్యాశాఖ అధికారులు తిరుపతి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ పాల్గొన్నారు.