07-10-2025 12:09:40 AM
నాగర్ కర్నూల్ అక్టోబర్ 6 ( విజయక్రాంతి )ప్రజా రవాణా సంస్థ రెగ్యులర్ బ స్సులలో పండగల పేరుతో ప్రయాణికుల నుండి స్పెషల్ చార్జీలను వసూలు చేయడా న్ని తక్షణం ఆపాలని బహుజన్ సమాజ్ పా ర్టీ నేతలు సోమవారం డిపో మేనేజర్ యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర మాజీ ఈసీ మెంబెర్ పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ మాట్లాడుతూ దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలపై అనవసరమైన అదనపు భారం మోపుతోందన్నారు.పండగలు ముగిసిన కొన్ని రోజుల తర్వాత కూడా స్పెషల్ చార్జీలు వసూలు చే యడం అన్యాయం అన్నారు. ఫీజు రీ-ఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ బిల్లులు, స్కూల్ బిల్లులు ఇలా ప్రతిదీ పెండింగ్లో పెడుతూ పెండింగ్ ప్రభుత్వాంగామారిందాన్నారు.