07-10-2025 12:08:51 AM
హాజరైన అంతర్జాతీయ ఉపాధ్యక్షులు పుల్లూరి ప్రకాష్ గుప్తా
నారాయణఖేడ్, అక్టోబర్ 6:నారాయణఖేడ్ నియోజకవర్గం వాసవి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకులు సోమవారం తెలిపారు. కార్యక్రమానికి వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు పుల్లురి ప్రకాష్ గుప్తా, గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్,హాజరై పాల్గొన్నారు. నారాయణఖేడ్ వాసవి క్లబ్ నూతన అధ్యక్షులుగా కోటగిరి సాయిబాబా ప్రధాన కార్యదర్శిగా, అర్థం రమేష్, కోశాధికారిగా దారం మహేష్ లతో ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 16 రాష్ట్రాల్లో, అంతర్జాతీయ స్థాయిలో 8 దేశాల్లో వాసవి క్లబ్ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వాసవి క్లబ్ ద్వారా యువతలో చైతన్యవంతం, స్కిల్ డెవలప్మెంట్, సేవా కార్యక్రమాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రూ.20 కోట్ల నిధులతో సేవా కార్యక్రమా లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతుందని అన్నారు.
కార్యక్రమంలో అంతర్జాతీయ నాయకులు బానూరు ప్రకాష్, సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మునిగాల మాణిక్ ప్రభు, సెక్రటరీ వనం నరేందర్, రీజినల్ చైర్మన్ అల్లంకి విజయభాస్కర్, జోన్ చైర్మన్ బాలరాజు, నారాయణఖేడ్ వాసవి క్లబ్ నాయకులు సత్యనారాయణ, చాప్టర్ ప్రెసిడెంట్ కోటగిరి మల్లేశం, భూషణం , నగేష్, సాయి సంగమేష్, ధనరాజ్, పట్టణ అధ్యక్షులు దారం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి సతీష్, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.