20-09-2025 01:11:56 AM
120కి పైగా ఆస్తుల ప్రదర్శన
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): హైదరబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న జయా గార్డెన్స్‌లో నేటి నుంచి రెండు రోజుల పాటు ఇండియన్ బ్యాంక్ అసెట్స్ ఫెయిర్ జరగనుంది. ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం 6 గం టల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ కే శ్రీనివాస్, మల్కాజిగిరి జోనల్ మేనేజర్ స్వర్ణ ప్రభా సుందరరాయ్ .
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శుక్రవారం ఇండియన్ బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఫెయిర్‌లో హైదరాబాద్, అమరావతి, విజయవాడ, మల్కా జిగిరి, కరీంనగర్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి జోన్లు పాల్గొంటున్నాయి. 120కి పైగా నివాస, వాణిజ్య ఆస్తులను ప్రదర్శనకు ఉంచి, అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో అపార్ట్‌మెం ట్లు, వ్యక్తిగత గృహాలు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ అధికారి కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఫెయిర్ నిజమైన కొనుగోలుదారులకు, పెట్టుబడిదారు లకు చక్కటి అవకాశమని పేర్కొన్నారు. ఇం డియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఇలాంటి ఫెయిర్లను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరగ నున్న అసెట్స్ ఫెయిర్ 2025కు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు, వ్యక్తిగత కొనుగోలుదారులు పాల్గొ నే అవకాశం ఉందని తెలిపారు.