05-07-2025 08:06:00 PM
దారి దోపిడీలకు పాల్పడమే కాకుండా మరణాయుధాలతో దాడులు
ఏడాది పాటు జైలు: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర పార్తి ముఠా సభ్యులపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం తెలిపారు. ఒక సంవత్సరం కాలం పాటు బెల్ లేకుండా జైలుకే పరిమితమయ్యేలా శిక్ష విధించే విధంగా చేసినట్లు తెలిపారు. తరచుగా దొంగతనాలకు పాల్పడిమే కాకుండా, దారి దోపిడీలు చేయడం మరణాయుధాలతో దాడులు చేయడం నిత్య కృత్యంగా చేయడంతో వారిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన పార్తి ముఠా సభ్యులు నిజామాబాద్, కామారెడ్డి, అదిలాబాద్ జిల్లాలో 9 సార్లు దారి దోపిడీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన చొండా అలియాస్ కూలీ పవార్, జాకి గుజ్జియా బోస్లే, హరీష్ పవర్ అలియాస్ హర్ష, అనురాగ్ రత్నప్ప బోస్లే, లు ముఠాగా ఏర్పడి మరణాయుధాలతో దాడులకు పాల్ప డుతు దోపిడీలకు పాల్పడు తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఈ మూట సభ్యులు శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. నేరపూరిత వ్యక్తులుగా చలామణి అవు తూ ప్రజలలో భయభ్రాంతులకు గురిచేస్తారని, మరణాయుధాలు ధరించి దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపా రు. ఇకపై ఎవరైనా తరచుగా దొంగతనాలకు దోపిడీలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు.