calender_icon.png 6 July, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

05-07-2025 07:59:47 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో కోటి 34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అన్నారు. బాల సదనం పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా ఈ బాలసదనంలో అదనపు బ్లాకులనిర్మాణానికి గాను 60 లక్షల రూపాయల అదనపు బడ్జెట్ కావాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి జిల్లా కలెక్టర్ ను కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆమె ఆదేశించారు.