calender_icon.png 6 July, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి

05-07-2025 01:09:32 AM

ములుగు,జూలై4(విజయక్రాంతి) ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,ఆర్థిక శాఖ మాత్యులు కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు సేవ చేసిన రోశయ్య జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం,ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్,డిపిఓ సూపరింటెండెంట్ శ్రీనివాస్,ఆర్‌ఐ లు స్వామి,సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.