05-07-2025 08:02:47 PM
ఘట్ కేసర్: పోచారం మున్సిపల్ కార్మికుల మహాసభ శుక్రవారం పోచారంలో జరిగింది. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు పోచారం మున్సిపల్ కమిటీ 42 మందితో ఏర్పడింది. మున్సిపల్ గౌరవ అధ్యక్షులుగా సిఐటియు జిల్లా నాయకులు చింతల యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నార్కట్ పల్లి సబిత, అధ్యక్షునిగా జి. అశోక్, కార్యదర్శిగా వై. చంద్రమౌళి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చింతల యాదయ్య నార్కట్ పల్లి సబిత మాట్లాడుతూ పోచారం మున్సిపల్ విలీనమైన గ్రామపంచాయతీ కార్మికులకు మున్సిపల్ జీతాలు ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఐడెంటి కార్డు ఇవ్వాలని, ఇచ్చే జీతాలు ప్రతినెల 5వ తారీకు లోపు అందే విధంగా చూడాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులంతా తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి సాధించుకోవాలని జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సభ జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. 11మందితో కార్యవర్గం ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పోచారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా జి. అశోక్, కార్యదర్శిగా వై. చంద్రమౌళి ఉపాధ్యక్షులుగా సదానంద్, ఎల్లమ్మ, చంద్రశేఖర్, జి. మల్లేష్, సహాయ కార్యదర్శిగా ప్రవీణ్, సుజాత, కోశాధికారి వినోద్ రెడ్డిలను ఎన్నుకోవడం జరిగింది.