calender_icon.png 6 July, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజూరు పత్రాలు అందుకున్న వారు నిర్మాణాలను ప్రారంభించాలి

05-07-2025 08:20:04 PM

హౌసింగ్ పీడీ మాణిక్యం..

పాపన్నపేట: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మంజూరి పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే పనులను ప్రారంభించాలని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం(District Housing PD Manikyam) సూచించారు. శనివారం మండల పరిధిలోని కుర్తివాడలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లబ్ధిదారులు నిర్మాణాలను చేపట్టాలన్నారు. మంజూరు పత్రాలు పొంది ఇంకా ప్రారంభం కానీ వారిచే త్వరగా ప్రారంభం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇశ్రత్, హౌసింగ్ ఏఇ అరుణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్, నాయకులు అనిల్ కుమార్, రాజేందర్తో పాటు ఇతరులు ఉన్నారు