28-11-2025 12:07:34 AM
నిర్మల్, నవంబర్ 2౭(విజయక్రాంతి): పత్రికల స్వేచ్ఛపై కొన్ని ప్రభుత్వాలు వివక్ష ధోరణి విడనాడి పత్రికల్లో పని చేస్తున్న పాత్రికేయులకు భద్రతకు భరోసాకు కొత్త చట్టాలు రావా లని సీనియర్ పాత్రికేయుడు కట్ట నాగయ్య చారి గంగాధర్ పెన్షన్లను సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ప్రెస్ డే సంబురాలకు హాజరయ్యా రు.
సీనియర్ పాత్రికేయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ పాత్రికేయులు వారు రాసిన కథనాలపై ప్రజలకు అనుబంధంగా ఉంటే మంచి గుర్తిం పు వస్తుందన్నారు. పాత్రికేయులకు కనీస వేతనాల చట్టం అమలు చేయాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో సీనియర్ పాత్రికేయులు చారి, పత్తి శివప్రసాద్, నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాసం శ్రీధర్, లక్ష్మీనారాయణ, పలువువు పాత్రికేయులు పాల్గొన్నారు.